14 సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే మళ్ళీ చెన్నై వెళ్ళా …. అలాగే వుంది … ఏమీ మార్పు కనపడలేదు. పార్క్ స్టేషన్ నుండి లోకల్ ట్రైన్ లో వేలచేరి వెళ్ళా, 45 నిమిషాల ప్రయాణం, ఆ 45 నిమిషాలు మురికి కాలువల కంపు వెంటాడుతూనే వుంది, వర్షం పడుతోంది. స్టేషన్ లో దిగి టాక్సీ ఎక్కా. మెయిన్ రోడ్ ఎక్కగానే ట్రాఫిక్ జాం, మోకాలి లోతు నీళ్ళున్నాయి రోడ్డు మీద. లెఫ్ట్ సైడ్ చూస్తే మల్టీప్లెక్స్, రైట్ సైడ్ చూస్తే పెద్ద రిలయన్స్ షాపింగ్ మాల్ కనపడుతున్నాయి. మెల్లగా 2 KM దూరం 2 గంటల్లో చేరుకున్నా, దిగి నడిచి వెలిపోధామంటే కాళ్ళు మోపలేము. ఫ్రెండ్ అపార్ట్ మెంట్ కి వెళ్లేసరికి ఫ్యాన్ తిరుగుతోంది గానీ టీవీ రావటం లే. ఎందుకురా అంటే 3 గంటల నుండి కరెంటు లేదు, inverter, వచ్చేస్తాదిలేరా అన్నాడు. ఫ్రెష్ అవటానికి బాత్ రూం లోకి వెళుతుంటే స్నానం రేపు పొద్దున్న నీళ్ళు వచ్చినప్పుడు చేద్దువు గానీ ఇప్పుడు 2 మగ్గుల తో ముఖం కడుక్కోమన్నాడు. ఎలాగోలా చెన్నై లో నా పని ముగించుకుని చార్మినార్ express లో హైదరాబాద్ బయలుదేరా. ఒక పెద్దాయన HPCL లో రిటైర్డ్ మేనేజర్ ట్రైన్ లో మాటలు కలిపారు నాతో. మాటలలో నేను అన్నాను మీకేంటి సార్ త్వరలో బుల్లెట్ ట్రైన్స్ విత్ అల్ facilities like ఇంటర్నెట్, WiFi వస్తున్నాయి అని. వాటి సంగతి దేవుడెరుగు సార్, మాకు కరెంటు, నీళ్ళు సరిగ్గా ఇమ్మనండి సార్… దోమలు, కంపు, దరిద్రం లేకుండా మురికి కాలువలు సరిగ్గా వెయ్యమనండి సార్, దశాబ్దాలుగా ఇలాంటి basic facilities కూడా చెయ్య లేకుండా బుల్లెట్ లు, WiFi లు మాకు ఎందుకు సార్ అని తన బెర్త్ మీద వాలిపోయాడు. నేను బెర్త్ మీద చేరబడ్డాను గానీ చాలా సేపు నాకు నిద్ర పట్టలేదు, నెల రోజులు దాటిపోయినా అతని మాటలు ఇంకా నా చెవి లో మార్మోగుతూనే వున్నాయి….ఇప్పటికి కూడా ఎక్కడో దూరం గా ట్రైన్ కూత వినపడినా కూడా ఆ జ్ఞాపాకాలే గుర్తు వస్తున్నాయి…