బడా బాబుల రిజర్వేషన్ ల దోపిడీ

మా వూరిలో కొండయ్య, గోపాలం అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు, చిన్నప్పట్నించీ వాళ్ళ కుటుంబాలు నాకు బాగా తెలుసు. ఇద్దరివీ బాగా బీద కుటుంబాలే. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కొండయ్య తండ్రి అడవి లో నుండి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మేవాడు, చాలా కష్టమైన పని. అలా కష్టాలతోనే చదువుకుని రిజర్వేషన్ దయవలన కొండయ్య ఇంజనీర్ కాగలిగాడు, మళ్ళీ జాబు లో రిజర్వేషన్ వలన త్వరగా promotions వొచ్చి ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నాడు. రిజర్వేషన్స్ ఎంత మేలు చేసాయో అన్పించింది ఇతనిని చూస్తే …. తన కొడుకు అవినాష్ ని చిన్నప్పట్నించీ మంచి ఇంటర్నేషనల్ ప్రైవేటు స్కూల్స్ లో చదివించాడు. ఇప్పుడు అవినాష్ సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్స్ వలన IFS సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ కుటుంబం ఎవరూ మా వూరి ముఖం కుడా చూడలేదు, హైదరాబాద్ లో జూబిలీ హిల్స్ లో పెద్ద విల్లా లో ఉంటున్నారని తెలుసు…అదీ కొండయ్య కుటుంబ ప్రగతి….
ఇక గోపాలం సంగతి చూద్దాం….గోపాలం తండ్రి చెప్పులు కుట్టుకునే వాడు మా వూరి సెంటర్ లో, తనకి ఆరోగ్యం సహకరించకపోవటం వలన గోపాలం కుడా కుటుంబాన్ని పోషించటం కోసం తన తండ్రికి, అలాగే తన చదువుకి కూడా విశ్రాంతి ఇచ్చి చెప్పులు కుడుతూ ఉండిపోయాడు. కానీ కళ్ళ ముందే తన మిత్రుడు కొండయ్య రిజర్వేషన్స్ తో చదువుకోవటం, అతని కుటుంబం అంతా ఇప్పుడు హైదరాబాద్ లో హాయి గా వుండటం చూసి, తన చమటోడ్చి ఒక్కగానొక్క కొడుకు రాజయ్య ని బాగానే చదివించాడు. నేను కూడా ఎక్కువ కాదు గానీ ఒక 5000 రూపాయల ఆర్ధిక సాయం చేసా. మొత్తానికి రాజయ్య కూడా బాగానే కస్టపడి చదివి అవినాష్ తో పాటు సివిల్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు గానీ ఆ సామాజిక వర్గ కోటా లో ఆఖరు గా మిగిలింది అవినాష్ తన్నుకుపోయాడు, రాజయ్యకి ఏమీ రాలేదు. ఆ మధ్య రోడ్ మీద వెళ్తూ చూస్తే రాజయ్య వాళ్ళ చిన్న చెప్పుల దుకాణం లో షూస్ పాలిష్ చేస్తూ కనిపించాడు. గుండెల్లో చివుక్కుమని అన్పించి ఉండబట్టలేక వెళ్లి అడిగా ఏమయ్యింది నీ సివిల్స్ ఇంటర్వ్యూ అని, రాలేదు సార్, మా category లో ఆఖరు సీట్ అవినాష్ కి వచ్చింది, next నేనే సార్, వాడు అడ్డు లేకపోతే నాకు వచ్చి ఉండేది అని అంటూ షూస్ పోలిష్ చెయ్యాలా సార్ అంటూ ఇంకా ఏదో అడుగుతున్నాడు…నాకు కళ్ళు బైర్లు కమ్మి కాళ్ళ కింద నేల కదులుతున్నట్టు అన్పించింది…రిజర్వేషన్స్ ఎత్తేయ్యమని నేను అనట్లేదు, కానీ ఒక category లో బాగా బలిసిన వాడికి కూడా రిజర్వేషన్స్ ఇంకా వర్తిమ్పచెయ్యటం వలన అదే category లో బీద వాడు నష్టపోవటం ఎంత వరకు కరెక్ట్??? అయినా తెగ బలిసి, కార్లలో తిరిగి, duplex లో విల్లాస్ లో నివసిస్తూ కార్పొరేట్ స్కూల్స్ లో చదివే ఇంజనీర్ ల పిల్లలకి, డాక్టర్ ల పిల్లలకి, లాయర్ ల పిల్లలకి, businessmen ల పిల్లలకి, రాజకీయ నాయకుల పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్స్ ఇవ్వటం కంటే దారుణ మైన దోపిడీ ఇంకోటి ఉంటుందా.. మన దేశం లో తప్ప ప్రపంచం లో ఇంకెక్కడైనా వుందా ఇలాంటి విడ్డూరం…ఆలోచించండి…

One thought on “బడా బాబుల రిజర్వేషన్ ల దోపిడీ

  1. బాగా రాసారు, ఇలాంటి వాటి గురించి రాయడానికి చదువుకున్న (?) పెద్దమనుషులకు కూడా మనసు రాదు .
    తమ కులం లోనే రిజర్వేషన్స్ దుర్వినియోగమావుతున్నాయని తెలిసి కూడా తెలియనట్టు నటిస్తారు .
    నేను ఇలా చాలా మందిని చూసాను , చాలా బాధగా అనిపిస్తుంది. రిజర్వేషన్ తీసుకుని పైకి వచ్చినవాడు తనతో పాటు ఇంకోకందరిని తమ కులపు వాళ్ళని పైకి తీసుకుని రావడానికి సహకరించాలి .

    పక్క వాళ్ళ పడి ఎదవటానికి వీళ్ళకి సమయం ఉంటుంది , పుస్తకాలు మీద పుస్తకాలు రాయడానికి సమయం ఉంటుంది . ఆ పుస్తకాలు అమ్ముకోవడానికి నానా చెత్త వాగడానికి సమయం ఉంటుంది . కాని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ తోటి జనాలకి చెప్పడానికి మాత్రం సమయం ఉండదు .

    మళ్లి లోకం లో ఉన్న సమస్యలన్నింటికీ వాళ్ళ దగ్గర ఏవో పరిష్కారాలు ఉన్నట్టు పోస్ట్ / వార్తలు లు రాస్తుంటారు .

    Liked by 1 person

Leave a comment